రౌడీబేబీ దెబ్బకు ఫిదా పాట ఫ‌స‌క్

రౌడీబేబీ దెబ్బకు ఫిదా పాట ఫ‌స‌క్
x
సాయి పల్లవి, ధనుష్
Highlights

ఫిదా సినిమాలో వ‌చ్చిండే.. మెల్లమెల్లగా వ‌చ్చిండే అనే పాట ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.

ఫిదా సినిమాలో వ‌చ్చిండే.. మెల్లమెల్లగా వ‌చ్చిండే అనే పాట ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో.. ఈ పాటని మధుప్రియ పాడగా, సుద్దాల అశోక్ తేజ రాశారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. సాయి పల్లవి స్క్రీన్ పైన చాలా చక్కగా డాన్స్ చేసింది. ఈ పాట యూట్యూబ్ లో మంచి రికార్డ్ లను సృష్టించింది. ఈ పాటకు ఉన్న రికార్డుని బ్రేక్ చేయడం కష్టమని అందరు అనుకున్నారు. కానీ తన రికార్డును తానే బద్దలు కోడతనంటూ సాయిప‌ల్లవే వ‌చ్చి ఓన్ రికార్డ్ బ‌ద్దలు కొట్టేసింది.

ధనుష్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా మారి 2 అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని రౌడీబేబీ అనే పాట ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డుల మీదా రికార్డులను బద్దలు కొడుతుంది. ఏకంగా 183 మిలియ‌న్ వ్యూస్ ని అందుకుని యూట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది. ఈ పాట కేవ‌లం 11 నెలల్లోనే 725 మిలియ‌న్ వ్యూస్ అందుకుని ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా రికార్డులన్నీ తన పేరు రాసుకుంది. ఈ పాటను స్వయంగా ధనుష్ రాసి, ఆలపించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించారు. యూట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ సాంగ్.. మొత్తానికి ఈ రౌడీబేబీ దెబ్బకు ఇప్పుడు ఫిదా పాట ఫ‌స‌క్ అయ్యిందన్న మాట.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories