చిరంజీవి సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన ధనుష్

Dhanush has More Collections than Chiranjeevi
x

చిరంజీవి సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకున్న తమిళ్ హీరో

Highlights

*చిరంజీవి సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన ధనుష్

Tollywood: తమ స్టార్ ఈ మధ్యకాలంలో మధ్యకాలంలో అభిమానులు అందరూ తమ అభిమాన హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి మరియు అతడు సినిమాలు మళ్లీ అద్భుతమైన కలెక్షన్లను అందుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన జల్సా సినిమా ఆ రికార్డులను సైతం బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.

నిజానికి పవన్ జల్సా సినిమాకి ముందు వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు కేవలం మహేష్ బాబు అభిమానులను ఫాలో అవుతున్నారని ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవచ్చు అని అనుకున్నారు. కానీ మూడు కోట్ల కంటే పైగా స్పెషల్ షోస్ వల్ల కలెక్షన్లు నమోదు చేసుకుని జల్సా సినిమా మహేష్ బాబు అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన "త్రీ" సినిమా ని కూడా మళ్లీ రిలీజ్ చేశారు అభిమానులు.

హైదరాబాదులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఘరానా మొగుడు" సినిమాని రిలీజ్ చేసినప్పటికీ ఆ సినిమా కలెక్షన్లు మాత్రం అంత ఆశాజనకంగా కనిపించలేదు. "త్రీ" సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు రావడం చాలా మందిని షాక్ కి గురి చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా కంటే తమిళ్ సినిమా అయిన "త్రీ" తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు చేయటం చాలా అరుదైన సంఘటనని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories