OTT: తెలుగులో ధనుష్‌ హాలీవుడ్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

The Extraordinary Journey of the Fakir OTT
x

OTT: తెలుగులో ధనుష్‌ హాలీవుడ్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

Highlights

The Extraordinary Journey of the Fakir OTT: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్. ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

The Extraordinary Journey of the Fakir OTT: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్. ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. కాగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం యాపిల్ టీవీ+ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కేవలం ఇంగ్లిష్‌ వెర్షన్‌లో మాత్రమే.

కాగా ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా మార్చి 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఒక రోజు ముందే అంటే 25వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముంబయికి చెందిన అజాతశత్రు అలియాస్ లవశ్ పటేల్‌ (ధనుష్) స్ట్రీట్ మ్యాజీషియన్‌గా జీవనం సాగిస్తుంటాడు. తనకి ప్రత్యేక శక్తులు ఉన్నాయంటూ జనం నమ్మేలా కథలు చెబుతూ గడిపే పటేల్‌.. తల్లి మృతి తర్వాత పారిస్‌లో ఉండే తండ్రి కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు.

అదే సమయంలో ఊహించని ఘటనలో ఐకియా షోరూమ్‌లోని వార్డ్‌రోబ్‌లో చిక్కుకుంటాడు. ఆ తరువాత ఏమైంది? తండ్రిని కలిశాడా? ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది? లాంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా 2019లో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. 92 నిమిషాల నిడివితో సాగిన ఈ మూవీకి కెన్‌ స్కాట్‌ దర్శకత్వం వహించాడు. ఫ్రెంచ్ నవల ‘The Extraordinary Journey of the Fakir Who Got Trapped in an Ikea Wardrobe’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్ నటులు బెన్ మిల్లర్, ఎరిన్ మోరియాట్రి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories