ధమాకా టీమ్ అతనికి అన్యాయం చేసిందా?

Dhamaka Team Called Gajuwaka Conductor Where It Should Be Called Pulsar Bike
x

పల్సర్ బైక్ అనాల్సిన చోట గాజువాక కండక్టర్ అంటున్న ధమాకా బృందం

Highlights

* పల్సర్ బైక్ క్రియేటర్ ని హర్ట్ చేసిన ధమాకా బృందం

Dhamaka: వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు "ధమాకా" సినిమాతో పరవాలేదు అనిపించారు. ఈ సినిమాలో రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో ప్రేక్షకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా పల్సార్ బైకు పాట విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక సినిమాలో ఈ పాట సరైన సమయంలో వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే థియేటర్ మొత్తాన్ని ఒక ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు.

ఇది ఒక ప్రైవేట్ గీతం. ఇప్పటికే యూట్యూబ్లో చాలా పాపులర్ అయిపోయింది. "ఒరేయ్ గాజువాక కండక్టర్ పాట వేయండ్రోయ్" అని రవితేజ అనడంతో సినిమాలో ఈ పాట మొదలవుతుంది. ఇక సినిమా పాట మొత్తం రమణ అనే ఒక కుర్రాడు రాశాడు. గాజువాకలో కండక్టర్ అయిన ఝాన్సీ అనే ఒక అమ్మాయి ఈ పాటకు శ్రీదేవి డ్రామా కంపెనీలో స్టెప్పులేసింది. కానీ ధమాకా" వల్లే పాట పై క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే ధమాకా బృందం ఈ పాట క్రెడిట్ మొత్తం గాజువాక కండక్టర్కే ఇవ్వటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

గాజువాక ఝాన్సీ ఈ పాటకు కేవలం డాన్స్ మాత్రమే వేసింది కానీ ఆ పాట రాసి పాడిన రమణ బాగా ఫీలవుతున్నట్లు సమాచారం. ఒక క్రియేటర్ కష్టం గుర్తించటం లేదని కొందరు చెబుతున్నారు. కానీ డబ్బులు పరంగా అయితే ధమాకా రమణాకి మంచి మొత్తాన్ని ఇచ్చారట. ఆర్థికంగా ఓకే అయినప్పటికీ క్రెడిట్ మాత్రం పూర్తిగా ఇవ్వకపోవడంతో రమణ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories