మ‌రోసారి గ‌బ్బ‌ర్ సింగ్ కాంబినేష‌న్ రిపీట్.. ఫిక్స్ చేసిన హరీష్

మ‌రోసారి గ‌బ్బ‌ర్ సింగ్ కాంబినేష‌న్ రిపీట్.. ఫిక్స్ చేసిన హరీష్
x
Devisri Prasad, Harish Shankar (File Photo)
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హిట్ కోసం పదేళ్లు ఎదురుచూసిన పవన్ ఫాన్స్ కి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు హరీష్.. పవన్ మేనరిజం, శృతి హసన్ అందాలు, దేవిశ్రీప్రసాద్ పాటలు, బండ్ల గణేష్ నిర్మాణ విలువలు, అంత్యాక్షరి, కబడ్డీ సన్నివేశాలు ఫాన్స్ ని మళ్లీ మళ్లీ థియేటర్స్ వైపు రప్పించాయి.

అయితే నిన్నటితో(సోమవారం) ఈ సినిమాకి ఎనిమిదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. అందులో భాగంగా చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని ఫిక్స్ చేసినట్లు హరీష్ అనౌన్స్ చేశారు. మేమిద్ద‌రం పాత మ్యూజికల్ ఎనర్జీని మరోసారి కలిసి క్రియేట్ చేయడానికి వస్తున్నాం. ఈ విష‌యాన్ని ప్రకటించడానికి ఇంత కన్నా గొప్ప రోజు ఏముంటుంది.

మేం మళ్లీ వస్తున్నాం.. ఇప్పుడే మొదలైంది అంటూ హరీష్ శంకర్ వెల్లడించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఆ తరవాత హరీష్ శంకర్ తో సినిమా ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories