ప్రేమిస్తున్నా.. పెళ్లిపై రెడీగా లేను, విజయ్ ఆన్సర్‌కు షాకవ్వాల్సిందే

ప్రేమిస్తున్నా.. పెళ్లిపై రెడీగా లేను, విజయ్ ఆన్సర్‌కు షాకవ్వాల్సిందే
x
విజయ్ దేవరకొండ
Highlights

యూత్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సినిమాల్లో చేసిన క్యారెక్టర్ చిన్నదే

యూత్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సినిమాల్లో చేసిన క్యారెక్టర్ చిన్నదే అయినా.., ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యారు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైయ్యారు. అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగ... తాజా విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫిబ్రవ‌రి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమా ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్‌ని పెళ్లి గురించి వ్యాఖ్యాత ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోడానికి సిద్ధంగాలేనని స్పష్టం చేశారు. 'వివాహబంధంపై ఎంతో గౌరవం ఉంది. కానీ, ప్రస్తుతానికి మాత్రం నేను పెళ్లికి సిద్ధంగా లేనని. ఎందుకంటే ప్రస్తుతం నా కెరీర్‌ను నేను ప్రేమిస్తున్నాను. ఇంకా జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటున్నాను' అని దేవరకొండ విజయ్‌ పేర్కొన్నారు

ఈ నేప‌థ్యంలో సినిమా ప్రమోషన్లు భారీగా స్థాయిలో చిత్ర బృందం చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో నలుగురు అమ్మాయిలతో విజయ్ రొమాన్స్ చేయనున్నాడు. విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌, ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని సినిమాను రూపొందిచారు. కాగా.. ఈ చిత్రంలో రోమాన్స్ కు పెద్దపీట వేసినట్లు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. కేఏ వల్లభ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు.

.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories