సాయి ధరమ్ తేజ్ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్...

Deva katta Announced Sai Dharam Tej Republic Movie Sequel | Tollywood Gossips
x

సాయి ధరమ్ తేజ్ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్...

Highlights

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో విడుదలైన సినిమా "రిపబ్లిక్"...

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో విడుదలైన సినిమా "రిపబ్లిక్". పొలిటికల్ డ్రామాగా గత ఏడాది అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్య కృష్ణ, సుబ్బరాజు, ఆమని, రాహుల్ రామకృష్ణ, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సాయి ధరమ్ తేజ్ నటించిన మొట్టమొదటి పొలిటికల్ సినిమాగా ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ ను అందుకుంది. జేబీ ఎంటర్టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.అయితే తాజాగా చిత్ర డైరెక్టర్ దేవకట్టా సోషల్ మీడియా ద్వారా సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు. "రైటింగ్ / ఫామిలీ టైం! ఇప్పటిదాకా సినిమా కథ / ఐడియా తో ఏ హీరో కు కానీ నిర్మాతకు కానీ చెప్పలేదు.

కేవలం కొన్ని కొత్త ఐడియాస్ మరియు జోనర్స్ ను ఆలోచిస్తున్నాను. ఒకటి లేదా రెండు విభిన్న జోనర్ లలో సినిమాలు ట్రై చేసిన తర్వాత 'రిపబ్లిక్ 2' సినిమా ఉంటుంది" అని ట్వీట్ చేశారు దేవకట్ట. రిపబ్లిక్ సినిమాలో సాయి ధరంతేజ్ పాత్ర చనిపోయినట్టు చూపిస్తారు. మరి "రిపబ్లిక్ 2" సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories