దేశముదురు కథకి ముందుగా పూరి అనుకున్న హీరో ఎవరో తెలుసా?

దేశముదురు కథకి ముందుగా పూరి అనుకున్న హీరో ఎవరో తెలుసా?
x
puri jagannath (File Photo)
Highlights

అల్లు అర్జున్ కథానాయకుడిగా, హన్సిక కథానాయకగా నటించిన చిత్రం దేశముదురు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో

అల్లు అర్జున్ కథానాయకుడిగా, హన్సిక కథానాయకగా నటించిన చిత్రం దేశముదురు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ప్రభాస్ యోగితో పోటి పడి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తీసుకు వచ్చింది. హైదరాబాద్ లో ఓ రౌడీ కొడుకుని కొట్టి అక్కడి నుంచి పారిపోయి కులూమనాలి వచ్చి సన్యాసిగా ఉన్న ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు బాలగోవిందం. ఆ తర్వాత ఆ అమ్మాయికి హైదరాబాద్ లో ఉన్న రౌడీ మధ్య కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి హీరో ఆమెను ఎలా కాపాడాడు అన్నది మిగిలిన కథ..

సినిమాలో పూరీ పంచ్ డైలాగులు.. హన్సిక అందాలు.. అల్లు అర్జున్ డైనమిక్ యాక్షన్.. అలీ కామెడీ ట్రాక్ సినిమా సక్సెస్ లో పార్ట్ అయ్యాయి. అయితే ముందుగా ఈ కథని అల్లు అర్జున్ ని కాకుండా, అక్కినేని హీరో సుమంత్ కి చెప్పాడట పూరి. అప్పటికి సత్యం, గౌరి, మధుమాసం, గోదావరి లాంటి సినిమాలతో హిట్టు కొట్టి సుమంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనితో పూరీ దేశముదురు కథను సుమంత్ కి చెప్పాడట .. కానీ హీరో సన్యాసిని ప్రేమించడం ఏంటి ?అసలు అలా జరుగుతుందా ఎక్కడైనా అంటూ సుమంత్ ఈ కథను రిజెక్ట్ చేసాడు.

కానీ అప్పుడు పూరి సుమంత్ కి కేవలం లైన్ మాత్రమే చెప్పాడట .. ఒకవేళ ఫుల్ నెరేషన్ ఇచ్చుంటే బన్నీ కాకుండా తానే ఈ సినిమా చేసుండేవాడినేమో అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సుమంత్. కానీ ఏ మాటకి ఆ మాటే సుమంత్ ఓ బ్లాక్ బస్టర్ హిట్టును మిస్సయ్యాడు.

సుమంత్ తన కెరియర్ లో ఇలాగే చాలా సినిమాలని మిస్ చేసుకున్నాడు. అందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ, తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావలి, రవితేజ నటించిన ఇడియట్ సినిమాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories