ఇలాంటి సినిమాలు చూసి సభ్యసమాజం ఏమి నేర్చుకోవాలి

ఇలాంటి సినిమాలు చూసి సభ్యసమాజం ఏమి నేర్చుకోవాలి
x
Highlights

రాను రాను తెలుగు సినీపరిశ్రమ గాడితప్పుతోంది. అడ్డు అదుపు లేకుండా శృంగారాన్ని తలపించేలా సినిమాలు నిర్మిస్తున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఆధునిక యుగంలో...

రాను రాను తెలుగు సినీపరిశ్రమ గాడితప్పుతోంది. అడ్డు అదుపు లేకుండా శృంగారాన్ని తలపించేలా సినిమాలు నిర్మిస్తున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఆధునిక యుగంలో కళాపోషణకు సినిమా రంగం బలమైన సాధనంగా పరిణమించింది. కానీ, ఈ పరిశ్రమ ప్రారంభమైన తొలిదశల్లో కనిపించిన విలువలు కొంతకాలం తరువాత క్షీణించడం మొదలయింది. వ్యాపారానికి ప్రాముఖ్యత పెరిగి, జనాకర్షణ నెపంతో, చౌకబారు కథలు అందులో ప్రవేశించాయి. స్వేచ్ఛ ముసుగులో చూపించని సీన్లను చూపిస్తూ ప్రేక్షకులకు ఏవగింపు తెప్పిస్తున్నారు. ఏ సినిమాలో, ఏ హీరో అయినా సరే మందు సీసా లేకుండా కనపడడు. ఎమన్నా అంటే ఉన్నదే మేము చూపిస్తున్నాం అంటారు. తాను అనుభవించిన అద్భుతమైన అనుభూతిని లోకానికి పంచిపెట్టాలన్న కొరికే 'కళ' అంటారు మహారచయిత టాలెస్టెయిన్. అలాంటి కళకు కళంకం తెస్తున్నారు కొందరు సినిమావాళ్లు. తాజాగా విడుదల డిగ్రీ కాలేజ్, ఏడు చేపల కథ.. సినిమాల ట్రైలర్లు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది.

అశ్లీలతను ప్రోత్సాహిస్తూ వచ్చిన ఈ ట్రైలర్లు పలువురు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు నీలి చిత్రాలను తలపించేలా కేవలం కామ క్రీడలకే పెద్ద పీట వేశారు దర్శకనిర్మాతలు. ఇలాంటి సినిమాలు వలన సభ్య సమాజానికి, యుతవకు ఎలాంటి మేసేజ్‌ ఇస్తున్నాం. అసభ్యం, అశ్లీలం, ద్వంద్వార్థాల మాటలు, బూతు మాటలనే ఈ సినిమాల్లో ఉపయోగించారు. సినిమాల ప్రభావం సమాజంలో ఎంతోకొంత ఉంటుంది. ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన సినిమా ఎందుకు నిర్మించరు. సినిమాల్లో చూపిస్తున్న శృంగార సీన్లను చూసి ప్రేక్షకుడు ఏమి నేర్చుకోవాలి. నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారం ఇటువంటి సినిమాల ప్రభావంతో రోడ్లమీద జరగాలా? ఇలా అసభ్యకరమైన దృశ్యాలను ఆదర్శంగా, ప్రేరణగా తీసుకొని చాలాచోట్ల విద్యార్థులు తమ తమ కళాశాలల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంగతి మనం నిత్యం చూస్తున్నాం. అలాంటప్పుడు సామాజిక బాధ్యత ఎందుకు తీసుకోరు.

ఇలాంటి బూతు పురాణాలను చూస్తుంటే..తెలుగు సినిమా పరిశ్రమ ఎటు వెళ్తుంది అనే ప్రశ్న కలుగగ మానదు. భావప్రకటన పేరుతో విష సంసృతిని నెత్తినెక్కించుకుంటూ ఇటువంటి సినిమాలు తీస్తున్నారు. వినోదం చాటున నైతిక విలువలు ఏమవుతున్నాయి? యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నంలో శృంగారం శ్రుతి మించింది. బూతును నియంత్రించవలసిన సెన్సార్‌ ప్రేక్షక పాత్రకే ఎందుకు పరిమితం అయ్యారు? సినిమా అనే సమగ్ర కళాస్వరూపానికి పూర్వవైభవం వస్తుందా? ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? సినీపరిశ్రమకు చెందిన పెద్దమనుషులు ఒకచోట కూర్చొని, ఇటువంటి పరిస్థితిని మార్చేందుకు ఉపాయాలు ఆలోచించరా..? మధురమైన సంగీతం, మనోహరమైన గీతాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో మంచి కథాబలం కలిగిన సినిమాల కోసం ప్రేక్షకులు తహతహ లాడుతున్నారు. ఇటువంటి సినిమాల కోసం గంపెడాశతో ప్రేక్షకులు ఉన్నారు. ఇలాంటి సినిమాలను వదిలేసి అశ్లీలతకే పెద్దపీటవేయడం మూర్ఖత్వమే..!

Show Full Article
Print Article
Next Story
More Stories