Deepika Padukone: హ్యాపీ బర్త్‌డే దీపికా పదుకొణె ... 40 ఏళ్లలోనూ ఫిట్‌నెస్, గ్లోయింగ్ సీక్రెట్స్

Deepika Padukone: హ్యాపీ బర్త్‌డే దీపికా పదుకొణె ... 40 ఏళ్లలోనూ ఫిట్‌నెస్, గ్లోయింగ్ సీక్రెట్స్
x

Deepika Padukone: హ్యాపీ బర్త్‌డే దీపికా పదుకొణె ... 40 ఏళ్లలోనూ ఫిట్‌నెస్, గ్లోయింగ్ సీక్రెట్స్

Highlights

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె 40వ పుట్టినరోజు: ఫిట్‌నెస్, సమతుల్య ఆహారం, మానసిక ప్రశాంతత కోసం పాటించే రహస్యాలు ఇవే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, ఆమె ఫిట్‌నెస్, సమతుల్య ఆహారం, మానసిక శ్రేయస్సు కోసం పాటించే రహస్యాలను అభిమానులతో పంచుకున్నారు.

దీపికా ఎప్పటినుంచో ప్రాక్టికల్ డైట్ ను అనుసరిస్తున్నారు. కఠినమైన ఫ్యాడ్ డైట్స్ కాదని, జీవితాంతం పాటించదగిన సమతుల్య ఆహారం ఆమెకు ముఖ్యమని చెప్పింది. “నేను కడుపు నిండా తింటాను. మితంగా తింటూ, జీవితంలోని చిన్న సంతోషాలను ఆస్వాదించడం నా ఫిలాసఫీ,” అని ఆమె తెలిపింది.

అలాగే, మానసిక ప్రశాంతత కోసం ‘విపరీత కరణి’ యోగాసనాన్ని ప్రోత్సహించారు. దీని ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందని, సెల్ఫ్-కేర్ ను ప్రతిరోజూ అనుసరించడం ముఖ్యమని గుర్తు చేశారు. దీపికా ఫిట్‌నెస్, అందం, గ్లోయింగ్ లుక్ కోసం పాటించే చిన్న జాగ్రత్తలు, క్రమశిక్షణ ఆమె ప్రత్యేకత.

Show Full Article
Print Article
Next Story
More Stories