Top
logo

Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికకు కరోనా పాజిటివ్

Deepika Padukone Tests Positive With Corona
X

Deepika Padukone:(File Image) 

Highlights

Deepika Padukone: దీపిక చేయించుకున్న కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Deepika Padukone: దేశవ్యాప్తంగా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె చేరారు. దీపికకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నారు. వైద్యులు సూచించిన ఔషధాలను ఆమె వాడుతున్నారు. దీపికకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

మరోవైపు దీపిక కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారంతా బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే దీపిక తన భర్త, సినీ నటుడు రణ్ వీర్ సింగ్ తో కలిసి బెంగళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే దీపికకు కరోనా సోకినట్టు చెపుతున్నారు. అయితే, రణవీర్ కు కూడా కరోనా సోకిందా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్ సరసన 'పఠాన్' చిత్రంలో నటిస్తోంది. మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది. దీపిక తన రణ్ వీర్ సింగ్ తో కలసి స్పోర్ట్స్ డ్రామా 83 లో నటిస్తోంది. అది విడుదల కావాల్సింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్, అతని భార్య రోమి పాత్రలో దీపిక కనిపించనుంది.

Web TitleDeepika Padukone Tests Positive With Corona
Next Story