logo
సినిమా

Deepika Padukone: బాలీవుడ్ నటుల బాడీగార్డ్ లకు కోట్లల్లో జీతం

Deepika Padukone Bodyguard Salary in Crores
X

దీపిక పదుకునేతో జలాల్ (ఫైల్ ఫోటో)

Highlights

Deepika Padukone: "ఐశ్వర్య" అనే కన్నడ చిత్రంతో సినిమా కెరీర్ ని మొదలుపెట్టిన బాలీవుడ్ భామ దీపిక పదుకునే

Deepika Padukone: "ఐశ్వర్య" అనే కన్నడ చిత్రంతో సినిమా కెరీర్ ని మొదలుపెట్టిన బాలీవుడ్ భామ దీపిక పదుకునే అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. కన్నడ చిత్రం నుండి బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడమే కాకుండా స్టార్ హీరోలందరితోను స్క్రీన్ షేర్ చేసుకుంది. అటు బాలీవుడ్ తో ఆగకుండా హాలీవుడ్ లోను ఒకటి రెండు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక తన సినిమా జర్నీలో ప్రతి రోజు ఒక్కో ప్రాంతానికి రాత్రి అనక పగలనక షూటింగ్ ల కోసం వెళ్ళాల్సి వస్తున్న తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన బాడీ గార్డ్ జలాల్ చూసుకుంటాడని ఆమె ఒక ప్రకటనలో తెలిపింది.

కొన్ని ఏళ్ళ క్రితం జలాల్ ని బాడీ గార్డ్ నియమించుకున్న సమయం నుండి తనకి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ తనని ఒక చెల్లిలా చూసుకున్నాడని తనని ఒక బాడీ గార్డ్ లా కాకుండా ఒక అన్నగా భావిస్తానని దీపిక తెలిపింది. తన వద్ద నమ్మకంతో పని చేస్తున్న జలాల్ కి పండుగ రోజున రకరకాల బహుమతులతో పాటు నెలకి సుమారుగా 9 లక్షల రూపాయలను జీతంగా పొందుతున్నాడని సమాచారం. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపిక ప్రస్తుతం 5 కు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా షారుఖ్ ఖాన్ బాడీ గార్డ్ రవి సింగ్ ఏడాదికి 2.5 కోట్లు తీసుకోగా, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ షెరా 2 కోట్ల రూపాయలను జీతంగా చెల్లిస్తున్నారు

Web TitleDeepika Padukone Bodyguard Salary in Crores
Next Story