Deepika Padukone: దీపిక పదుకొనె బాడీ గార్డ్ జీతం ఎంతో తెలుసా?

Deepika Padukone: కరోనా ఉన్నా లేకపోయినా సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా బయట తిరగడం కుదరని పని.

admin1
Published on: 10 Aug 2021 9:21 PM IST
Deepika Padukone Bodyguard Jalal Earns up to Rs 1.2 crore Annual Income
X

Deepika Padukone: దీపిక పదుకొనె బాడీ గార్డ్ జీతం ఎంతో తెలుసా?

Deepika Padukone: కరోనా ఉన్నా లేకపోయినా సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా బయట తిరగడం కుదరని పని. ఎందుకంటే వాళ్లని చూడటం కోసం అభిమానులు గుమిగూడుతుంటారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్‌ అంటూ ఎగబడతారు. అదంతా వాళ్ళ అభిమానమే అయినా కొన్ని సార్లు అది శ్రుతి మించుతుంటుంది. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు తమ రక్షణ కోసం బాడీగార్డ్స్ ను నియమించుకుంటారు. అలాగే వారికి జీతాలు కూడా భారీగానే ఉంటాయి. తాజాగా బాలీవుడ్‌ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె బాడీగార్డ్ జీతం ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

దీపిక పదుకొనె బాడీ గార్డ్ పేరు జలాల్‌. దీపికా ఇంటి గేట్ దాటిన దగ్గరనుండి తిరిగి ఇంటి లోపలికి వెళ్ళేదాకా జలాల్‌ ఆమె వెంట ఉండి ఆమెను రక్షిస్తూ ఉంటాడు. దీనికి గానూ దీపిక అతడికి ఏడాదికి ఏకంగా రూ.1.2 కోట్ల జీతం ఇస్తుందట. అలాగే బాడీగార్డ్‌ ను కూడా తన ఇంటి మనిషిగా భావించి ప్రతి ఏడాది రాఖీ కూడా కడుతుందట. ఇక దీపికా రణ్‌వీర్‌ పెళ్లి రోజున కూడా అతనే సెక్యూరిటీ హెడ్‌గా పనిచేశారు. ప్రస్తుతం క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్ గా వస్తున్న '83' చిత్రంలో నటిస్తుండగా, దీపిక పఠాన్‌తో పాటు ప్రభాస్‌- నాగ్‌అశ్విన్‌ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story