Deepika Padukone: దీపికా పదుకొణెకు మరో గౌరవం.. ఆ జాబితాలో చోటు

Deepika Padukone: దీపికా పదుకొణెకు మరో గౌరవం.. ఆ జాబితాలో చోటు
x

Deepika Padukone: దీపికా పదుకొణెకు మరో గౌరవం.. ఆ జాబితాలో చోటు

Highlights

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘ది షిఫ్ట్‌’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఆమె పేరు నిలిచింది.

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘ది షిఫ్ట్‌’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఆమె పేరు నిలిచింది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఇందులో బాలీవుడ్‌ డైరెక్టర్‌ జోయా అక్తర్, హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లు ఏంజెలినా జోలీ, సెలినా గోమెజ్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో తొలి భారతీయ నటి

ఇప్పటికే ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక. అంతకుముందు 2018లో టైమ్స్ మ్యాగజైన్ ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్’ లిస్ట్‌లోనూ ఆమె చోటు దక్కించుకున్నారు.

ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఆవిష్కరణతో ఆకర్షణ

2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఆవిష్కరించి గ్లోబల్ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్నారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటికీ హీరోయిన్‌గా టాప్ లీగ్‌లో కొనసాగుతున్నారు.

అల్లు అర్జున్‌తో కొత్త సినిమా

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘AA 26’ సినిమాలో కథానాయికగా దీపిక ఎంపికైన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories