ఒళ్లు గగుర్పొడిచేలా దండుపాళ్యం 4 ట్రైలర్

ఒళ్లు గగుర్పొడిచేలా దండుపాళ్యం 4 ట్రైలర్
x
Highlights

ఈ చిత్రాలకు సీక్వెల్ గా దండుపాళ్యం నాలుగో భాగం తెలుగు కన్నడ బాషల్లో కూడా తెరకెక్కుతుంది. కాగా.. వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌, కీలక పాత్రధారులుగా దండుపాళ్యం 4 చిత్రం తెర‌కెక్కుతుంది.

పూజా గాంధీ, రఘు, ముఖర్జీ పాత్రదారులుగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్ దండుపాళ్యం చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలింసిందే. ఈ చిత్రం ఇప్పటికే మూడు భాగాలుగా తెరకెక్కింది. ఈ చిత్రాలకు సీక్వెల్ గా దండుపాళ్యం నాలుగో భాగం తెలుగు కన్నడ బాషల్లో కూడా తెరకెక్కుతుంది. కాగా.. వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌, కీలక పాత్రధారులుగా దండుపాళ్యం నాలుగో భాగం తెర‌కెక్కుతుంది. కేటీ నాయక్ దర్శకత్వంలో రూపొందిన దండుపాళ్యం 4 ను నవంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. గత చిత్రాలకు మించి మరింత హింసాత్మకంగాను, శృంగార భరితంగాను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సాహిత్యం భువనచంద్ర అందించారు. తాజాగా విడుదైన ట్రైలర్ సెన్షేషన్ సృష్టిస్తుంది. దండుపాళ్యం మూడు చిత్రాలాగే ఈ చిత్రం కూడా విజయవంతం అవుతుందని నిర్మత తెలియజేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories