డైరెక్టర్ గా మారనున్న డాన్స్ కొరియోగ్రాఫర్

Dance Choreographer Will Become a Director
x

డైరెక్టర్ గా మారనున్న డాన్స్ కొరియోగ్రాఫర్ 

Highlights

Shekar Master: ప్రభుదేవా అడుగుజాడల్లో నడుస్తున్న శేఖర్ మాస్టర్

Shekar Master: ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టుగా డైరెక్టర్లు అయిన వారి లాగానే ఏదో ఒక విధంగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత దర్శకుడిగా మారిన వారు ఉన్నారు. హీరోలుగా సినిమాటోగ్రాఫర్లుగా నిర్మాతలుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఎందరో టెక్నీషియన్లు ఆ తర్వాత డైరెక్టర్లుగా కూడా మారారు. ప్రభుదేవా లారెన్స్ అమ్మ రాజశేఖర్ సన్నీ వంటి కొరియోగ్రాఫర్లు కూడా దర్శకులుగా మారారు. ప్రభుదేవా కి మొదట్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు పడినప్పటికీ ఆ తర్వాత తన గ్రాఫ్ బాగా తగ్గిపోయింది.

అమ్మ రాజశేఖర్ వంటి వారు కూడా మంచి బ్లాక్ బస్టర్ ను తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. లారెన్స్ కూడా తన హారర్ కామెడీ సినిమాలతో కొన్ని హిట్లు అందుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలేమీ తీయలేదు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఈ జాబితాలో చేరుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ కొన్ని టీవీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరించారు.

తాజాగా ఇప్పుడు శేఖర్ మాస్టర్ దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డైరెక్టర్ గా తన మొదటి సినిమాతో ప్రేక్షక ముందుకు రావాలని శేఖర్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా ఫస్ట్ కాపీ పూర్తయ్యేదాకా ఈ సినిమాకి సంబంధించిన విషయాలను సీక్రెట్ గానే ఉంచాలని శేఖర్ మాస్టర్ అనుకుంటున్నారట. ప్రభుదేవా కి శిష్యుడైన శేఖర్ మాస్టర్ ఇప్పుడు ప్రభుదేవా లాగానే మెగా ఫోన్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి డైరెక్టర్ గా శేఖర్ మాస్టర్ మంచి విజయాన్ని సాధించగలరా లేదా వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories