నవీన్‌ పొలిశెట్టికి అరుదైన గౌరవం.. తెలుగులో మరో ఐదుగురికి

నవీన్‌ పొలిశెట్టికి అరుదైన గౌరవం.. తెలుగులో మరో ఐదుగురికి
x
Highlights

యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టిని( ఏజెంట్ సాయి శ్రీవివాస అత్రేయ ) 'దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ 2020' అవార్డు వరించింది.

యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టిని( ఏజెంట్ సాయి శ్రీవివాస అత్రేయ ) 'దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ 2020' అవార్డు వరించింది. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తాజాగా 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌ సౌత్‌ 2020' జాబితాను ప్రకటించారు. తెలుగు చిత్రసీమలో ఆరు కెటగిరల్లో ఈ అవార్డు వరించింది. ఉత్తమ హీరో, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, మ్యూజిక్ డైరక్టర్ భాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా నవీన్ పొలిసెట్టి, , ఉత్తమ నటిగా రష్మీకామందన( డియర్ కామ్రేడ్ ), ప్రభాస్ నటించిన సాహో చిత్ర దర్శకుడు సుజిత్ కు బెస్ట్ డైరెక్టర్ గా.. మ్యూజిక్ దర్శకుడిగా థమన్ పేరును ప్రకటించింది. మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్స్‌‌గా నాగార్జునకు 'దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ 2020' అవార్డు వరించింది.

భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారం అందిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మశతి సందర్భంగా 1963లో ఈ అవార్డులను ప్రవేశపెట్టారు. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు.1963లో నటీమణి దేవికా రాణికి మొదట అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు.

కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డి( బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి). "మల్లీశ్వరి", "బంగారు పాప" లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. నిజానికి బియన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇద్దరు తెలుగు బియన్ లు ఈ అవార్డ్ అందుకోగా మరో బియన్ అయిన బి యన్ సర్కార్, బియన్ అనదగిన నితిన్ బోస్ కూడా ఈ పురస్కారం అందుకొన్నారు. బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories