Shubman Gill: ఇండియన్ స్పైడర్ మ్యాన్ గా క్రికెటర్ శుభ్ మన్ గిల్

Cricketer Shubman Gill To Lend His Voice To Indian Spider-Man
x

Shubman Gill: ఇండియన్ స్పైడర్ మ్యాన్ గా క్రికెటర్ శుభ్ మన్ గిల్ 

Highlights

Shubman Gill: ఈ స్పైడర్ మ్యాన్ సినిమాలో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ భాగం అయ్యాడు.

Shubman Gill: స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. స్పైడర్ మ్యాన్ సినిమా కోసం చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ రాక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైడర్ మ్యాన్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కాకుండా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ ఇలా పలు భారతీయ భాషల్లో జూన్ 2న విడుదల కానుంది.

ఈ స్పైడర్ మ్యాన్ సినిమాలో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ భాగం అయ్యాడు. ఇండియన్ వెర్షన్ లోని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ పవిత్ర ప్రభాకర్ కు శుభ్ మన్ గిల్ వాయిస్ అందిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ,పంజాబీ వెర్షన్లకు శుభ్ మన్ డబ్బింగ్ చెప్పాడు. ఈ మేరకు స్పైడర్ మ్యాన్ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేస్తున్న సోనీ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించడమే కాకుండా శుభ్ మన్ తో కూడిన స్పెషల్ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేసింది.

పవిత్ర ప్రభాకర్ కు డబ్బింగ్ చెప్పడం పై శుభ్ మన్ గిల్ స్పందించాడు. చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తూ పెరిగానని..తన అభిమాన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని శుభ్ మన్ తెలిపాడు. ఇదిలాఉంటే, ఐపీఎల్ 2023లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్టార్ బ్యాట్స్ మెన్..హాలీవుడ్ ఫ్రాంచైజీకి డబ్బింగ్ చెప్పిన మొదటి భారతీయ క్రీడాకారుడిగా అరుదైన గుర్తింపు సాధించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories