Bheemla Nayak: సాగర్ కే చంద్ర పరిస్థితి కూడా అదేనా?

Credits Getting for only Pawan Kalyan and Trivikram Srinivas to Bheemla Nayak Movie
x

భీమ్లా నాయక్ సినిమా (ఫైల్ ఫోటో)

Highlights

Bheemla Nayak Director - Sagar K Chandra: గబ్బర్ సింగ్ సినిమాలో కె.ఎస్.రవీంద్ర విషయంలో కూడా అదే జరిగింది.

Bheemla Nayak Director - Sagar K Chandra: మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమా ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. "భీమ్లా నాయక్" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పవర్స్టార్ పవన్కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులను అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ సాగర్ కే చంద్ర పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలై సూపర్ హిట్ అయినా సరే కేవలం వీరిద్దరి పేర్లు మాత్రమే హైలైట్ అవుతాయని ఈ క్రెడిట్ సాగర్ కి మాత్రం రాదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గబ్బర్ సింగ్ సినిమాలో కె.ఎస్.రవీంద్ర విషయంలో కూడా అదే జరిగింది.

ఇప్పుడు సాగర్ కే చంద్ర విషయంలో కూడా అదే జరుగుతుందని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ తదితర వేడుకల్లో పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ సాగర్ ని ఎంత పొగిడినా సరే క్రెడిట్ మాత్రం ఆయనకి దక్కే అవకాశాలు తక్కువే చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories