Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ భవనం సీజ్.. కరోనా పాజిటివ్

Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ భవనం సీజ్.. కరోనా పాజిటివ్
x
Highlights

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఇంటిని సీజ్ చేయడం తోపాటు పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా మార్చారు. మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే ఒకరికి కరోనా...

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఇంటిని సీజ్ చేయడం తోపాటు పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా మార్చారు. మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. జూన్‌ 8న బిల్డింగ్‌ సీల్‌ చేసినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇంటి వద్దే ఉంటున్న మలైకా.. కుమారుడు అర్హాన్ తో కాలక్షేపం చేస్తోంది. ఈ క్రమంలో రోజూ ఓ గంట యోగా చేస్తానని మలైకా చెప్పారు.

తను యోగా ఆసనాలను ఇన్ స్టాలో రోజూ షేర్ చేశారు. ఇదిలావుంటే గత 24 గంటల్లో భారతదేశంలో 9,996 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,579 కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 357 మరణాలు నమోదయ్యాయి, మొత్తం సంఖ్య 8,102 కు చేరుకుంది. ఇక 1,41,028 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 1,37,448 మంది చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories