Tollywood: మళ్లీ థియేటర్ల బంద్ తప్పదా..? టాలీవుడ్ పరిస్థితి ఏంటి?

Corona Second Wave In Tollywood
x

TFI

Highlights

Tollywood: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ తప్పదా? టాలీవుడ్ బిగ్ మూవీస్ పరిస్థితి ఏంటి?

Tollywood: వందల కోట్ల బడ్జెట్.. నాన్‌స్టాప్‌గా భారీ సినిమాల షూటింగ్స్.. వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్న బిగ్ మూవీస్. ఇలాంటి టైంలో థియేటర్లు మళ్లీ మూత పడితే?? కరోనా సెకండ్ వేవ్ కంగారెత్తిస్తున్న వేళ టాలీవుడ్ ప్రొడ్యూసర్‌లు ఇలాంటి భయాలనే వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ తప్పదా? టాలీవుడ్ బిగ్ మూవీస్ పరిస్థితి ఏంటి? భారీ సినిమాల రిలీజ్‌లు వాయిదా పడతాయా? కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇప్పటివరకూ టాలీవుడ్‌పై పడలేదు. అయితే ఏ క్షణాన ఎలాంటి వార్త వినాలనిపిస్తోందో అన్న భయం మాత్రం ప్రొడ్యూసర్‌లను వెంటాడుతోంది. ఇదంతా ఒకెత్తయితే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నవి మామూలు సినిమాలు కాదు.,అన్నీ భారీ సినిమాలే! దీంతో విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అన్న అశం ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు.. పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే.. పూర్తిగా థియేటర్లు మూసివేయకున్నా.. 50శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునే అవకాశం ఇవ్వచ్చు. కానీ దీని వల్ల పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పవు. గతంలో మాదిరిగా మళ్లీ రిలీజ్‌లు వాయిదా వేసుకునే పరిస్థితే ఏర్పడుతుంది. అటు.. లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడంతో పరిశ్రమ భారీ నష్టాలను చవిచూసింది. దీంతో ప్రభుత్వాలే పరోక్షంగా సినీ పరిశ్రమను ఆదుకున్నాయి.

ఇక.. లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ మళ్లీ థీయేటర్లు మూసేయాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటన్న సందిగ్ధంలో పడింది. అయితే.. ప్రభుత్వం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వ నిర్ణయానికి సినీ పరిశ్రమ కట్టుబడి ఉంటుందని వ్యాఖ్యానించారు నిర్మా దామోదర్ ప్రసాద్.

ప్రభుత్వాలు తీసుకోబోయే నిర్ణయంపై లక్షలాది కార్మికుల నుంచి ప్రొడ్యూసర్‌ల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. మరి కరోనా కల్లోలంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories