Coolie OTT Release: థియేటర్స్‌లోనే ఉంటూ స్ట్రీమింగ్‌కు రెడీ.. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యమే!

Coolie OTT Release: థియేటర్స్‌లోనే ఉంటూ స్ట్రీమింగ్‌కు రెడీ.. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యమే!
x

Coolie OTT Release: థియేటర్స్‌లోనే ఉంటూ స్ట్రీమింగ్‌కు రెడీ.. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యమే!

Highlights

అంచనాల నడుమ విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజే రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో కోలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ-స్టారర్‌లో రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, సౌబిన్ తదితరులు నటించారు. పోస్టర్స్ నుంచి ట్రైలర్ వరకూ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్ మెప్పించినా.. సినిమా మాత్రం అందరి మనసులు దోచుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కూలీ, ఓటీటీ రిలీజ్‌కు సెట్ అవుతోందని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో కూలీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం వారం రోజుల ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు టాక్.

థియేటర్స్‌లో దూసుకుపోతూనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న కూలీ డిజిటల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories