Coolie: కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Coolie: కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు
x

Coolie: కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Highlights

సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూలీ భారీ అంచనాల మధ్య పాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్ మాస్ బజ్ క్రియేట్ చేసినా.. థియేటర్స్‌లో మాత్రం ఆ మిరాకిల్ జరగలేదు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూలీ భారీ అంచనాల మధ్య పాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్ మాస్ బజ్ క్రియేట్ చేసినా.. థియేటర్స్‌లో మాత్రం ఆ మిరాకిల్ జరగలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నప్పటికీ, రజనీకాంత్‌కు తగ్గ ఎమోషన్, ఎలివేషన్ మిస్సైపోయాయని కామెంట్స్ వచ్చాయి. అలాగే లాజిక్‌కి అందని కథనం, రజనీ స్టైల్ పంచ్ డైలాగ్స్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో వచ్చిన గత మూడు సినిమాలు కల్ట్‌గా నిలిచినా, కూలీ మాత్రం ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే, థియేటర్స్‌లో విడుదలై ఇప్పటివరకు రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, తమిళనాట రికార్డులు సృష్టించిన కూలీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ముందుగానే సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 11 నుంచి పాన్ ఇండియా భాషల్లో కూలీ స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్ రిలీజ్ అయిన 28 రోజులకే ఓటీటీకి వస్తోంది.

థియేటర్స్‌లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూలీ ఓటీటీలో ప్రేక్షకుల నుండి ఏ విధమైన రిస్పాన్స్ రాబడుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories