Rashmika: గుణపాఠం చెప్పాలి.. రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే ఫైర్

Congress Mla Wants Rashmika Taught a Lesson For Disregarding Kannada
x

గుణపాఠం చెప్పాలి.. రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే ఫైర్

Highlights

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కెరీర్‌ను ప్రారంభించిన పరిశ్రమను రష్మిక విస్మరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rashmika: 16వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలకు సినీ ప్రముఖులు ఎవరూ హాజరుకాకపోవడంపై నేతలు మండిపడుతున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కెరీర్‌ను ప్రారంభించిన పరిశ్రమను రష్మిక విస్మరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రష్మిక కన్నడ సినిమా కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత ఏడాది అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి తాము ఆహ్వానం పంపితే నిరాకరించిందని మండిపడ్డారు. మా ఎమ్మెల్యే ఒకరు ఆమెను ఆహ్వానించేందుకు 10-12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని.. అయినా ఆమె నిరాకరించారని చెప్పారు. తన ఇల్లు హైదరాబాద్‌లో ఉందని.. ఈవెంట్‌కు వచ్చేందుకు తనకు సమయం కూడా లేదని.. రాలేనని చెప్పారన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె కెరీర్ ప్రారంభించినప్పటికీ కన్నడ భాషను విస్మరించారు. అగౌరవపరిచారు. మనం ఆమెకు గుణపాఠం నెర్పకూడదా..? అన్నారు గనిగ.

శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చలనచిత్రోత్సవ ప్రారంభోత్సవానికి కన్నడ చిత్ర పరిశ్రమ తక్కువ సంఖ్యలో హాజరు కావడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టుమని పది మంది నటులు కూడా పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. ఇది తన ప్రైవేట్ కార్యక్రమం కాదని.. పరిశ్రమ కార్యక్రమం. నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరుకాకపోతే మరెవరు హాజరు అవుతారు..? అని అన్నారు. అవసరముంటే వారికి ప్రభుత్వం సాయం చేయాలి. థియేటర్లు, చిత్ర నిర్మాణానికి రాయితీలివ్వాలి. మేము అవకాశం ఇవ్వకుంటే థియేటర్లు నడపలేరు. ఎవరి నట్లు, బోల్ట్‌లు ఎలా సరిచేయాలో తనకు తెలుసునన్నారు డీకే శివకుమార్.

ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు విరుచుకుపడ్డారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. అనేకసార్లు ఈ చలన చిత్రోత్సవాలకు రష్మికను ఆహ్వానించినట్టు చెప్పారు. అయినప్పటికీ ఆమె నిరాకరిస్తూ వస్తున్నారన్నారు. కొన్ని రోజుల క్రితం రష్మిక ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను హైదరాబాద్‌కు చెందినదానినని చెప్పడం వివాదాస్పదమైంది. ఆమె చేసిన కామెంట్స్‌కు కొన్ని కన్నడ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

రష్మిక కెరీర్ విషయానికొస్తే.. రక్షిత్ శెట్టి నటించిన కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన రష్మిక ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మా, పుష్ప1, పుష్ప2 చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories