'మా'లో మళ్లీ గొడవ.. మా అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నాం: జీవిత

మాలో మళ్లీ గొడవ.. మా అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నాం: జీవిత
x
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 'మా' నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై నరేష్ తప్పుడు...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 'మా' నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై నరేష్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో 15 మంది ఈసీ కమిటీ సభ్యులు కూడా సంతకం చేశారు. గతంలో శివాజీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. నరేష్ కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వారు ఏం చేశారో.. అంతా ఈ 9 పేజీల లేఖలో పేర్కొన్నామన్నారు.

క్రమ శిక్షణ సంఘం నరేష్‌ వ్యవహారంపై చర్చలు జరిపి సరైన చర్య తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అసోసియేషన్ లో ఏక పక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని సినీనటి జీవిత ఆరోపించారు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ ఏం చేయడం లేదని విమర్శించారు. అసోసియేషన్ కు అఫిషియల్ గా రాజీనామా చేసినట్లు చెప్పారు. మొత్తం 18 మంది సంతకాలు చేశామని వెల్లడించారు జీవిత.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories