Sunil: 'మండేలా' రీమేక్ లో సునీల్‌?

Sunil: కథ బాగుంటే.. ఏ భాషలో సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.

Venkata Chari
Published on: 6 May 2021 10:03 PM IST
Comedian Sunil To Play Mandela Remake
X

సునీల్ (ఫొటో ట్విట్టర్)

Sunil: కథ బాగుంటే.. ఏ భాషలో సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలాంటి కొన్ని సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్‌గా తెరపైకి వచ్చి అలరిస్తుంటాయి.

తాజాగా తమిళ హాస్యనటుడు యోగిబాబు నటించిన 'మండేలా' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. ఈ సినిమా రాజకీయ వ్యంగ్య హాస్య చిత్రంగా వచ్చి అద్భుత విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ మదొన్నె అశ్విన్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

తెలుగు మండేలాగా ప్రముఖ హాస్య కథానాయకుడు సునీల్ నటించనున్నారని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం సునీల్‌ హీరోగా తెలుగు, కన్నడంలో తెరకెక్కుతున్న ద్విభాషాచిత్రం 'డీటీఎస్‌'(డేర్‌ టు స్లీప్‌)తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు అభిరామ్ పిల్లా దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2: ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్'కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'ఎఫ్‌ 3'లోనూ సునీల్ నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'పుష్ప'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక తెలుగు మండేలాలో నటిస్తాడని టాక్.

Venkata Chari

Venkata Chari

Next Story