Raju Srivastava: ప్రముఖ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Comedian Raju Srivastava Passes Away in Delhi
x

Raju Srivastava: ప్రముఖ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Highlights

Raju Srivastava: గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు శ్రీవాస్తవ

Raju Srivastava: ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆగస్టు 10వ తేదీన రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఎయిమ్స్‌లో చేరాడు.

టీవీ ఇండస్ట్రీలో రాజు శ్రీవాస్తవకు మంచి గుర్తింపు ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన స్టాండ్-అఫ్ కమెడియన్‌లలో రాజు శ్రీవాస్తవ కూడా ఒకరు. అనేక మంది రాజకీయ నాయకులను అనుకరించడం ద్వారా రాజు శ్రీవాస్తవ ప్రజాదరణ పొందారు. అలాగే మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా.. వంటి హిందీ చిత్రాలలో కనిపించారు. శ్రీవాస్తవ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories