భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న రవితేజ సినిమా క్లైమాక్స్

Climax of Ravi Teja Movie to be Released with a Huge Budget
x

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న రవితేజ సినిమా క్లైమాక్స్ 

Highlights

Ravi Teja: మాస్ మహారాజా సినిమా కోసం ఐదు కోట్లు పెట్టి భారీ సెట్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" ఈ మధ్యనే డిజాస్టర్ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమా పైన ఆశలన్నీ పెట్టుకున్నారు రవితేజ. ప్రస్తుతం రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో "రావణాసుర" అనే ఒక యాక్షన్ త్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అక్కినేని హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. కాగా ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ కోసం మాత్రమే నిర్మాతలు ఐదు కోట్లతో ఒక భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ డి ఆర్ కె కిరణ్ పర్యవేక్షణలో దర్శక నిర్మాతలు ఈ భారీ సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ ఇక్కడే జరగనుంది. స్టన్ శివ ఈ యాక్షన్ సన్నివేశాలను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా నిలవబోతోందని ప్రేక్షకులకు కచ్చితంగా కన్నుల విందు గా ఉంటుందని తెలుస్తోంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ వంటి ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories