Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌కు FSLలో క్లీన్‌చిట్‌

Clean Chit in FSL for Puri Jagannadh and Tarun in Tollywood ‌Drugs Case
x

పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌కు FSLలో క్లీన్‌చిట్‌ (ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* ఇద్దరూ డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవన్న ఎక్సైజ్‌ శాఖ‌ * 2017లో పూరీ, తరుణ్‌ గోళ్ల నమూనాలు పరీక్షించిన FSL

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు సినీ ప్రముఖులకు ఎస్‌ఎఫ్‌ఎల్‌ టెస్ట్‌లో క్లీన్‌చిట్‌ లభించింది. పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేల్చింది ఎక్సైజ్‌ శాఖ. 2017లో పూరీ, తరుణ్‌ గోళ్ల నమూనాలు ఎఫ్ఎస్‌ఎల్ పరీక్షించగా స్వచ్ఛందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ తెలియజేసింది.

అదేవిధంగా గతేడాది డిసెంబర్‌ 8న ఎస్‌ఎఫ్‌ఎల్‌ నివేదికలు సమర్పించిందని తెలిపింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తోపాటు వివరాలు కోర్టుకు సమర్పించిన ఎక్సైజ్‌శాఖ ఎస్‌ఎఫ్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వాంగ్మూలం కూడా కోర్టుకు సమర్పించింది. మరోవైపు ప్రధాన నిందితుడు కెల్విన్‌ కు సమన్లు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. డిసెంబర్‌ 9న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories