Prabhas - Radhe Shyam: రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్ కోసం మళ్లీ ఆ సినిమా చూశారట...

Prabhas - Radhe Shyam: రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్ కోసం మళ్లీ ఆ సినిమా చూశారట...
Prabhas - Radhe Shyam: ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమా ఒక ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.
Prabhas - Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా ఒక ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది.
టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, సచిన్ ఖెడేకర్, తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మనోజ్ పరమహంస కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ గురించి మాట్లాడుతూ, "బాహుబలి" సినిమా తర్వాత మేము ప్రభాస్ సర్ ని ఒక సరికొత్త లుక్ లో ప్రజెంట్ చేయాలని అనుకున్నాము.
దానికోసమే మేము "వర్షం" సినిమా మళ్ళీ చూశాం. అక్కడి నుంచి ఒక ఐడియా వచ్చింది. నాకు బాగా ఇష్టమైన సినిమాలలో "వర్షం" కూడా ఒకటి. సినిమా విడుదలై ఇప్పటికి 10 నుంచి 15 ఏళ్లు దాటి ఉండొచ్చు కానీ ఆ సినిమా అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం," అంటూ చెప్పుకొచ్చారు మనోజ్ పరమహంస.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT