'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి ఇప్పటివరకు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే?

కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇప్పటివరకు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే?
x
chiranjeevi (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది..

ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటికే ఈ ఛారిటీకి దాదాపుగా ఏడుకోట్లు మేర విరాళాలు అందినట్టుగా సమాచారం...

ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే ?

కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చినవారి పూర్తి వివరాలు

చిరంజీవి - కోటి రూపాయలు

నాగార్జున - కోటి రూపాయలు

ప్రభాస్ - రూ.50 లక్షలు

రామ్ చరణ్ - రూ. 30 లక్షలు

నాని - రూ. 30 లక్షలు

మహేష్ బాబు- రూ. 25 లక్షలు

ఎన్టీఆర్ - రూ. 25 లక్షలు

బాలకృష్ణ - రూ. 25 లక్షలు

నాగచైతన్య - రూ. 25 లక్షలు

అల్లు అర్జున్ - రూ. 20 లక్షలు

వరుణ్ తేజ్ - రూ. 20 లక్షలు

రవితేజ - రూ. 20 లక్షలు

శర్వానంద్ - రూ. 15 లక్షలు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - రూ. 10 లక్షలు

యూవీ క్రియేషన్స్ - రూ. 10 లక్షలు

సాయిధరమ్ తేజ్ - రూ. 10 లక్షలు

విశ్వక్ సేన్ - రూ. 5 లక్షలు

దర్శకుడు సంపత్ నంది- రూ. 5 లక్షలు

శ్రీకాంత్ - రూ. 5 లక్షలు

శ్రీమిత్ర చౌదరి - రూ. 5 లక్షలు

సుశాంత్ - రూ. 2 లక్షలు

కార్తికేయ - రూ. 2 లక్షలు

వెన్నెల కిషోర్ - రూ. 2 లక్షలు

సప్తగిరి - రూ. 2 లక్షలు

లావణ్య త్రిపాఠి - రూ. 1 లక్ష

సంపూర్ణేష్ బాబు - రూ. 1 లక్ష

బ్రహ్మాజీ - రూ. 70వేలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories