Donald Trump: ట్రంప్‌ను ఆ సినిమాలో తీసుకోవడం శాపంగా మారింది: అమెరికన్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Donald Trump: ట్రంప్‌ను ఆ సినిమాలో తీసుకోవడం శాపంగా మారింది: అమెరికన్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

Donald Trump: అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్‌ తీరు వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది.

Donald Trump: అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్‌ తీరు వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్నాయి. మొదట అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేస్తానని మొదలు పెట్టిన ట్రంప్‌, ఇప్పుడు సుంకాలతో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు.

కేవలం ఇతర దేశాల నుంచే కాకుండా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో అతనికి సొంత దేశంలో కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాజా ఓ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు కూడా ట్రంప్‌ను విమర్శించారు. "హోమ్ అలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్" చిత్ర దర్శకుడు క్రిస్ కొలంబస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1992లో విడుదలైన ఈ క్రిస్మస్ కామెడీ సినిమాలో ట్రంప్ ఒక అతిథి పాత్రలో కొన్ని సెకన్ల పాటు కనిపిచారు. అయితే ఈ విషయం తనకు ఇప్పుడు బాధను కలిగిస్తోందని, ఆ నిర్ణయం తన కెరీర్‌లో ఓ తప్పుగా మిగిలిందని క్రిస్ కొలంబస్ పేర్కొన్నారు. "అది ఒక శాపంలా మారింది. ఆయనను సినిమాలో చేర్చకపోతే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తోంది," అని ఆయన వెల్లడించారు.

అయితే అప్పట్లో ట్రంప్ నటించిన సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని కూడా ప్రయత్నించామని, కానీ భయంతో ఆ ఆలోచనను విరమించుకున్నామని ఆయన తెలిపారు. ‘‘ఆ సీన్‌ను కట్ చేసుంటే, నన్ను అమెరికా నుంచే గెంటేశేవారు. ప్రజలు దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని, దేశద్రోహిగా చూసేవారు,’’ అని ఆయన అన్నారు. ఇక ట్రంప్ గతంలో ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా కొలంబస్ స్పందించారు.

ఈ సినిమాలో నటించమని కోరుతూ చిత్రబృందం తన వెంటపడిందని ట్రంప్‌ చేసిన కామెంట్స్‌లో నిజం లేదని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక వ్యక్తిని తన ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇందులో యాక్ట్‌ చేయాలని ట్రంప్‌ ఎంతో ఆసక్తి చూపించారని.. అందుకే ఆయన్ని 7 సెకన్ల సీన్‌ కోసం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories