Saroj khan death news: నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ఇకలేరు!

Saroj khan death news: నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ఇకలేరు!
x
Saroj Khan Death (File images)
Highlights

Saroj khan death news: బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ దివంగతులయ్యారు. తన నృత్య రీతులతో ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సరోజ్ ఖాన్ సెలవంటూ వెళ్ళిపోయారు.

ఆమె నడిస్తేనే నాట్యం. పెద్ద పెద్ద హీరోయిన్లు ఆమె కాల్షీట్ల కోసం తమ కాల్షీట్లను ఎడ్జస్ట్ చేసుకునే వారు. ఒక శ్రీదేవి.. ఒక మాధురీ దీక్షిత్.. ఒక మీనాక్షీ శేషాద్రి ఇలా చెప్పుకుంటూ పొతే ఈజాబితాకు అంతే ఉండదు. వీరందరినీ వెండితెర మీద నృత్య తారలుగా వెలిగేలా చేసిన ఘనత తెరవెనుక ఆమెదే. సరోజ్ ఖాన్.. 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. మూడు జాతీయ బహుమతులు.. వందలాది సినిమాలు.. వేలాది పాటలకు నృత్యరీతులు.. అన్నిటినీ అభిమానులకు వదిలి ఆమె మరలిరాని లోకాలకు వెళ్ళిపోయారు.

గత శనివారం ముంబాయిలోని గురునానక్ ఆసుపత్రిలో శ్వాసకోశ సంబంధిత బాధలతో చేరిన ఆమె శుక్రవారం (జూలై 3) తెల్లవారుజామున కన్నుమూసారు.

ఎప్పుడో 1950 దశకంలో బాలనటిగా బాలీవుడ్ కు పరిచయం అయిన ఆమె.. తరువాత కొరియోగ్రాఫర్ గా మారారు. దాదాపు 50 సంవత్సరాలు నృత్య దర్శకురాలిగా ఆమె ఎన్నో విజయాల్ని అందుకున్నారు. ''మదర్ ఆఫ్ డ్యాన్స్'' గా అందరితోనూ పిలిపించుకున్నారు.

తొలిసారిగా ఆమె 1974లో వచ్చిన ''గీతా మేరా నామ్‌'' సినిమాలో నృత్యదర్శకురాలిగా పరిచయం అయ్యారు. తోలిసినిమాతోనే ఆమె అందరి మన్ననలూ పొందారు. తరువాత ఆమె ఎన్నో సినిమాలకు కొరియో గ్రాఫర్ గా పనిచేసినా.. 'మిస్టర్ ఇండియా' సినిమాలో శ్రీదేవికి ఇచ్చిన నృత్యాభినయాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అక్కడి నుంచి శ్రీదేవితో వరుసగా నాగినీ, చాంద్ నీ వంటి సినిమాలతో శ్రీదేవి అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యెక స్థానాన్ని ప్రేక్షకుల్లో ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అంతకు ముందు కోరియోగ్రాఫర్ల గురించి పెద్దగా ప్రేక్షకులకు తెలిసేది కాదు. సరోజ్ ఖాన్ రాకతో ఒక ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు.

ఇక మాధురీ దీక్షిత్ కు 'తేజాబ్' సినిమాలో 'ఏక్‌.. దో.. తీన్‌' పాటకు ఆమె సమకూర్చిన డ్యాన్స్ కు భారతదేశ సినిమా అభిమానులే కాదు ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఫిదా అయిపోయారు. బాలీవుడ్ లో ఆమె కోరియోగ్రఫీలో చేయాలని తారలు ఉవ్విల్లూరెవరు. ఆమె కాల్శీట్లకు అనుగుణంగా తమ కాల్షీట్లను ఇచ్చేవారు.

ఇక 2003లో దేవదాసు సినిమాలోని 'డోలా రే డోలా' పాటకు, 2006లో శృంగారం సినిమాలోని అన్ని పాటలకు, 2008లో 'జబ్‌ వి మెట్‌'లోని 'యే ఇష్క్‌ హాయే' పాటకూ ఆమె జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

తెలుగులో 1998లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా చూడాలని ఉందికి ఆమె పనిచేశారు. ఆ సినిమాలో కోరియోగ్రఫీకి ఆమెకు నంది అవార్డు రావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories