logo
సినిమా

నరేష్ ని వదిలేశారు కానీ నాని ని పట్టుకున్నారు

నరేష్ ని వదిలేశారు కానీ నాని ని పట్టుకున్నారు
X
Highlights

ప్రస్తుతం 'జెర్సీ' సినిమా తో బిజీగా ఉన్న నాని విక్రమ్ కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే....

ప్రస్తుతం 'జెర్సీ' సినిమా తో బిజీగా ఉన్న నాని విక్రమ్ కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'గ్యాంగ్ లీడర్ 'అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా లలో ఒకటైన గ్యాంగ్ లీడర్ టైటిల్ ని ఎలా వాడతారు అని మెగా అభిమానులు కౌంటర్లు వేశారు. నాని అని మాత్రమే కాక ఏ హీరో కూడా 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను వాడుకోవడానికి వీల్లేదు అంటూ మెగా అభిమానులు విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని అభిమానులు కూడా ఒక కొత్త వర్షన్ ను చర్చకి తీసుకొచ్చారు.

గతంలో కామెడీ హీరో అల్లరి నరేష్ 'యముడికి మొగుడు' అనే టైటిల్ ను ఉపయోగించారు. చిరంజీవి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా లో అది కూడా ఒకటి. అప్పుడు మాత్రం మెగా అభిమానులు ఏమీ మాట్లాడలేదు. ఆ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే నరేష్ చిరు టైటిల్ ను వాడుతున్నప్పుడు నాని మాత్రం ఎందుకు ఉపయోగించ కూడదు అని నాని ఫాన్స్ మెగా ఫాన్స్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాక చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా విజేత టైటిల్ ను ఉపయోగించాడు. అప్పుడు కూడా ఎవ్వరూ అతనికి అడ్డు చెప్పలేదు. మరి కేవలం నాని కి మాత్రమే మాత్రమే ఎందుకు ఆవుతున్నారు అంటూ గొడవ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై నాని ఇంకా స్పందించలేదు.

Next Story