Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ అదరగొట్టింది

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ అదరగొట్టింది
x

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ అదరగొట్టింది

Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న చిరు, ప్రస్తుతం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న చిరు, ప్రస్తుతం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇందులో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, పాటలు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి.

విశ్వంభర తర్వాత చిరు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ కాంబోలో పక్కా మాస్, కామెడీతో కూడిన ఎంటర్టైనర్ రాబోతుందని టాక్‌. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో వెంకటేష్ వాయిస్ ఓవర్‌గా వినిపిస్తూ.. "మన శంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు" అంటూ టైటిల్‌ను రివీల్ చేశారు.

బాస్ లుక్‌లో చిరు ఎంట్రీ అదిరిపోయింది. సూట్ వేసుకుని స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ కారు నుంచి దిగిన షాట్, చివర్లో గుర్రం పట్టుకుని నడిచే సీక్వెన్స్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ ఇచ్చాయి. బీమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా మాస్‌కి నచ్చేలా ఉంది.

మొత్తం మీద అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబో సినిమా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే హైప్ ఏర్పడింది.



Show Full Article
Print Article
Next Story
More Stories