logo
సినిమా

Chiranjeevi: సీక్రెట్ గా కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన చిరంజీవి

Chiranjeevi Secretly Has Some Next Film Projects | Telugu News
X

సీక్రెట్ గా కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన చిరంజీవి

Highlights

Chiranjeevi: సీక్రెట్ గా కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన చిరంజీవి

Chiranjeevi: సీక్రెట్ గా కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన చిరంజీవిప్రస్తుతం మెగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆచార్య". మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి బోలెడు సినిమాలను సైన్ చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మనకు తెలిసిన సినిమాలు మాత్రమే కాక కొన్ని సినిమాలను సీక్రెట్ గా కూడా చిరంజీవి లైన్ లో ఉంచారని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చేతిలో గాడ్ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు వెంకీ కుడుముల్ తో కూడా చేతులు కలపడానికి సిద్ధమవుతున్నారు చిరంజీవి. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరికొందరు డైరెక్టర్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రజినీకాంత్, అమితాబచ్చన్ లాగా మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. యువ స్టార్ హీరో సైతం సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేయడానికి ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి స్పీడ్ చూస్తే మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే లాగా కనిపిస్తున్నారు.

Web TitleChiranjeevi Secretly Has Some Next Film Projects | Telugu News
Next Story