"ఆచార్య" గురించి మళ్లీ రియాక్ట్ అయిన చిరంజీవి

"ఆచార్య" గురించి మళ్లీ రియాక్ట్ అయిన చిరంజీవి

Rama Rao
Updated on: 13 Oct 2022 8:30 PM IST
Chiranjeevi Said We have Returned 80% of the Remuneration of Acharya Movie
X

"ఆచార్య" గురించి మళ్లీ రియాక్ట్ అయిన చిరంజీవి

Chiranjeevi: ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. చిరంజీవి కరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.

నిజానికి ఈ సినిమా కంటే ముందు విడుదలకు ముందు చిరంజీవి సినిమా ప్రమోషన్ల కోసం చాలానే కష్టపడ్డారు. ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. సినిమాపై బజ్ ను తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత మాత్రం చిరంజీవి మీడియా ముందుకి రాలేదు. విడుదలకి ముందు వరకు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి సినిమా విడుదలైన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు.

ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పింది మాత్రమే తాము చేసామని కానీ సినిమా ఫ్లాప్ అవడం నా బాధాకరమని కొరటాలపై తోసేశారు చిరంజీవి. తాజాగా మళ్లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి చెప్పిన చిరంజీవి "ఆచార్య ఫ్లాప్ అయిన తర్వాత సినిమా నిర్మాతలకు మేము 80% రెమ్యునరేషన్ తిరిగిచ్చేసాము. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. ఆచార్య విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు," అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

Rama Rao

Rama Rao

Next Story