రామ్ చరణ్ కాకపోతే పవన్ కళ్యాణ్ ఆ పాత్రకి సెట్ అవుతాడు అంటున్న చిరంజీవి...

Chiranjeevi Said That If Ram Charan is Not There Pawan Kalyan Will Set For Siddha Role In Acharya
x

రామ్ చరణ్ కాకపోతే పవన్ కళ్యాణ్ ఆ పాత్రకి సెట్ అవుతాడు అంటున్నా చిరంజీవి...

Highlights

Megastar Chiranjeevi: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య...

Megastar Chiranjeevi: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని నిర్మిస్తున్న ఆ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

ఇక మెగాస్టార్ మరియు మెగా పవర్ స్టార్ లను ఒకేసారి వెండితెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ లలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలియజేస్తున్నారు దర్శక నిర్మాతలు. మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి ఆచార్య సినిమా లో సిద్ధ పాత్ర కి రామ్ చరణ్ బెస్ట్ అని అన్నారు.

సిద్ధ పాత్రలో మరెవరైనా ఉంటే బాగుంటుందా అని విలేకరి అడగగా "చరణ్ కాకుండా మరే నటుడైన సిద్ధ పాత్రకు న్యాయం చేయేలేరు. అయితే నిజ జీవితంలో తండ్రీకొడుకులు ఈ పాత్రలలో చేస్తే వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. అది కథకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఒకవేళ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ ఈ పాత్రకి సెట్ అవుతాడు. ఎందుకంటే ఆ కథలో ఉండే ఫీల్ ను పవన్ కళ్యాణ్ 100% తీసుకు వస్తాడు," అని నా అభిప్రాయం అని అన్నారు మెగాస్టార్.

Show Full Article
Print Article
Next Story
More Stories