Chiranjeevi: ఏఎన్నార్ అవార్డు అందుకున్న చిరంజీవి..తనయుడి మాటలకు మురిసిపోయిన తల్లి అంజనమ్మ

Chiranjeevi: ఏఎన్నార్ అవార్డు అందుకున్న చిరంజీవి..తనయుడి మాటలకు మురిసిపోయిన తల్లి అంజనమ్మ
x
Highlights

Chiranjeevi: ఏఎన్నార్ జాతీయ అవార్డు 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఈ వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది.

Chiranjeevi: ఏఎన్నార్ జాతీయ అవార్డు 2024 వేడుకలు వైభవంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్ తారాలోకి తరలివచ్చింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి నాగార్జున కుటుంబంతోపాటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా వచ్చింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డుఇవ్వనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అవార్డును బిగ్ బి అమితాబ్, చిరంజీవికి ప్రదానం చేశారు. కాగా అమితాబ్, చిరంజీవికి శాలువా కప్పి సన్మానించారు. అంతేకాదు మెగాస్టార్ ను దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు బిగ్ బి.

అమితాబ్ పాదాలకు నమస్కరించారు చిరంజీవి. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే సూత్రాన్ని గుర్తు చేశారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. నేను రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తుందని అన్నారు. బయటవాళ్లు తనను ఎంత పొడిగినా..తన తండ్రి మాత్రం పొగిడే వాడు కాదని బిడ్డలను పొగిడితే ఆయుక్షీణం అని ఆయన భావించేవారని చిరంజీవి అన్నారు. చిరంజీవి మాటలకు ఆయన తల్లి అంజనమ్మ మురిసిపోయారు.

ఇక ఈ వేడుకలో నాగేశ్వరరావు మరణానికి ముందు మాట్లాడిన చివరి ఆడియోను వినిపించారు. నా కోసం మీరంతా దేవుడిని ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తానన్న నమ్మకం నాకు ఉంది. మీ ప్రేమకు రుణపడి ఉంటాను. ఇక సెలవు అని ఐసీయూలో మాట్లాడారు. ఈ ఆడియో విన్న చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories