Chiranjeevi- Ram Charan: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Chiranjeevi Joins in Ram Charan Tej Dil Raju Combo movie?
x

రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Chiranjeevi- Ram Charan: మెగా అభిమానులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ లాంటి విషయమే.

Chiranjeevi- Ram Charan: మెగా అభిమానులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ లాంటి విషయమే. అవునండీ, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ కలిసి ఓ సినిమాలో మరలా నటించబోతున్నారంట. 'మగధీర' , 'బ్రూస్‌లీ' చిత్రాల్లో వీరిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి, ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన విషయం తెలిసిందే.

ఈ రెండు చిత్రాల్లో మెగాస్టార్ గెస్ట్‌ రోల్‌ మాత్రమే చేశారు. అలాగే చిరంజీవి నటించిన 'ఖైదీ నం. 150' లో ఓ పాటలో కనిపించి స్టెప్పులేశాడు చెర్రీ. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాం చరణ్‌ లీడ్‌ రోల్‌ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ ఏడాది మే 13న విడుదల కానుంది.

తాజా సమాచారం మేరకు... రాం చరణ్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ కాంబో లో ఓ మూవీ ప్లాన్ చేసినట్లు తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాను 'దిల్' రాజు నిర్మస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి ఓ లీడ్‌ క్యారెక్టర్‌ పోషించబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే...అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఆగాల్సిందే. మరోసారి చిరంజీవి, రామ్‌చరణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారా? అనేది చూడాలి. ఏదేమైనా ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఉత్సాహాన్ని నింపుతోంది.

అయితే, నేషనల్ డైరెక్టర్ శంకర్‌ తో ఓ సినిమా చేయాలని ఉన్నట్లు మెగాస్టార్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో మూవీ ముందుకు పడలేదు. మరి దిల్ రాజు మెగాస్టార్ కోరికను ఎంతవరకు సాధ్యం చేస్తాడో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories