Chiranjeevi: కూతురి కోసం గిఫ్ట్ ఇవ్వనున్న మెగాస్టార్

Chiranjeevi is Planning to Make a Film Under the Production of His Daughter Sushmitha
x

Chiranjeevi: కూతురి కోసం గిఫ్ట్ ఇవ్వనున్న మెగాస్టార్

Highlights

Chiranjeevi: కూతురి కోసం గిఫ్ట్ ఇవ్వనున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది సుష్మిత. ఇక తాజాగా ఇప్పుడు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థతో ఒక నిర్మాతగా కూడా మారింది.

"షూటౌట్ ఎట్ అలైర్" అనే ఒక వెబ్ సిరీస్ ను నిర్మించిన సుష్మిత మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సుష్మిత చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాణంలో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ తన కూతురు సుస్మిత నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

సినిమా కోసం డైరెక్టర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తన కూతురికి గిఫ్ట్ లాగా చిరంజీవి ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఆచార్య సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య తదితర సినిమాల్లో నటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories