Chiranjeevi: మేమంతా ఓ కుటుంబం, అభిమానులు అర్థం చేసుకోవాలి.. చిరు ఆసక్తికర వ్యాఖ్యలు


Chiranjeevi: మేమంతా ఓ కుటుంబం, అభిమానులు అర్థం చేసుకోవాలి.. చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఈ సందర్భంగా బాలకృష్ణతో కలిసి ఫ్యాక్షన్ చిత్రంలో నటించాలని ఉందని మనసులో మాటను బయట పెట్టారు చిరు.
హీరోల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. నిజానికి హీరోలంతా ఎంతో సాన్నిహిత్యంతో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అభిమానులే గొడవలు పడుతుంటారు. ఇదే విషయాన్ని చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా నటుడు నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ మొదలు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'కొన్ని సందర్భాల్లో అభిమానులు గొడవలు పడుతుంటారు. అందుకని, హీరోల మధ్య ఎంత మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునే వాళ్లం... మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారని! మా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. మాతో కలిసి ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు. మేమంతా ఓ కుటుంబం. అభిమానులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇక ఈ సందర్భంగా బాలకృష్ణతో కలిసి ఫ్యాక్షన్ చిత్రంలో నటించాలని ఉందని మనసులో మాటను బయట పెట్టారు చిరు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమా అంటే గుర్తుకు వచ్చే పేరు బాలకృష్ణేనని, రాయలసీమ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయని ఈ సందర్భంగా గుర్తు చేశౄరు. ఇంద్ర సినిమా చేయడానికి 'సమర సింహారెడ్డి' స్ఫూర్తి అని తెలిపారు. ఇక బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనేది తన కోరిక అని ఆయన తెలిపారు.
బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఈ ఘతన బాలయ్యే సొంతమన్నారు. బాలకృష్ణకు ఆ భగవంతుడు వందేళ్లు ఇదే ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నానని, రాజకీయ, వైద్య రంగాలలో అతనిలా సేవ చేయడం న భూతో న భవిష్యతి అని కొనియాడారు. బాలయ్య బాబు సినీ స్వర్ణోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తన ప్రత్యేకత చాటుకున్నారు అని అన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



