టాలీవుడ్‌లో విషాదం.. చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కన్నుమూత
x
రాజ్ కుమార్ ఫైల్ ఫోటో
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు'. ఈ సినిమా దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు'. ఈ సినిమా దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కారణంగా బాధపడుతోన్న ఆయన శనివారం తనువుచాలించారు. రాజ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించారు. రాజ్‌కుమార్‌ స్వస్థలం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు. కాగా.. భౌతికకాయాన్ని ఉయ్యూరు తరలించేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు మరణించారు. ఆ తర్వాత భార్య కూడా మృతి చెందడంతో ఒంటరివాడు అయ్యాడు. అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. శనివారం రాజ్ కుమార్ మృతిచెందారు.

చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు సినిమాకు రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా రాజ్‌కుమార్‌కు కూడా పునాదిరాళ్లు మొదటి సినిమా. రాజ్‌కుమార్‌ తన మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఆ చిత్రానికి ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు పొందారు. అటువంటి దర్శకుడు రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు సినీపరిశ్రమ నుంచి కొందరూ పెద్దలు కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. 'మనం సైతం' సంస్థ తరపున కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేలు, ప్రముఖ డైరెక్టర్ పూరిజగన్నాథ్‌ రూ.50 వేలు, ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌, ఫీలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి రూ.41వేలు రాజ్ కుమార్ కు ఆర్థిక సాయం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories