Godfather: "గాడ్ ఫాదర్" కలెక్షన్ల విషయంలో మెగాస్టార్ షాక్..

GodFather Box Office Collection: మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Arun Chilukuri
Published on: 9 Oct 2022 10:40 AM IST
Chiranjeevi Expresses Gratitude to Audience for Success of Godfather
X

Godfather: "గాడ్ ఫాదర్" కలెక్షన్ల విషయంలో మెగాస్టార్ షాక్..

GodFather Box Office Collection: మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదల అయింది. నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, మురళి శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, తదితరులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల పరంగా కూడా మంచి నుంబర్లు రికార్డ్ చేస్తోంది.

రెండు రోజులకు కలిపి ఈ సినిమా 45 కోట్ల దాకా వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలో చిరు ఒక వీడియో ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. "హలో ఫ్రెండ్స్. నమస్తే. గాడ్‌ఫాదర్‌ పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మా ధన్యవాదాలు. కేవలం రెండు రోజులలోనే సినిమా 69 కోట్ల రూపాయల ఆదాయాన్ని అధిగమించిందని అన్నారు. నిజంగా దీన్ని మీరు పాన్-ఇండియన్ సినిమాగా చేసారు. సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు మరియు నా అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు," అని అన్నారు చిరు.

ఐతే వీడియో లో చిరు ఈ చిత్రం 2 రోజుల్లో 69 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అన్నారు కానీ వాస్తవానికి సినిమా రెండు రోజుల గ్రాస్ దాదాపు 45 కోట్లు. దాదాపు 25కోట్ల మేర హైప్ చేసి ప్రచారం చేయడం ఆశ్చర్యకరం. అది కూడా చిరు స్వయంగా ఈ నంబర్స్ ని ప్రకటించడంతో జనాలు షాక్ అవుతున్నారు. కొందరేమో చిరంజీవి కి అసలు కలెక్షన్లు తెలియదని, తన ప్రొడక్షన్ లేదా పిఆర్ టీమ్ చెప్పే మాటలను నమ్ముతారని అందుకే అలా అన్నారని కవర్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story