లారెన్స్‌కి 10 ల‌క్ష‌లు విరాళం అందించిన మెగాస్టార్

లారెన్స్‌కి 10 ల‌క్ష‌లు విరాళం అందించిన మెగాస్టార్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి, లారెన్స్ మధ్య మంచు అనుబంధం ఉందని అందరికి తెలిసిందే. చిరు వీణ స్టెప్ తో సహా లారెన్స్, చిరు తో చాలా సినిమాల్లో పని చేసి బోలెడు...

మెగాస్టార్ చిరంజీవి, లారెన్స్ మధ్య మంచు అనుబంధం ఉందని అందరికి తెలిసిందే. చిరు వీణ స్టెప్ తో సహా లారెన్స్, చిరు తో చాలా సినిమాల్లో పని చేసి బోలెడు సూపర్ హిట్ స్టెప్స్ కంపోజ్ చేశారు. తాజాగా 'కాంచ‌న 3' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ అటెండ్ కాలేక‌పోయినా త‌న త‌ర‌పున ఒక ఏవీని, బహుమతిని పంపించారు. "లారెన్స్ నాకు రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా తెలుసు. ముఠామేస్త్రి సినిమాలో ఒక గ్రూప్ డ్యాన్స‌ర్ గా ఒక మూల ఉండి డ్యాన్స్ చేశాడు. అప్పుడే అత‌డి ప్ర‌త్యేక‌త‌ను గుర్తించి అబ్జ‌ర్వ్ చేశాను. రెండేళ్ల తర్వాత 'ఆంటీ' సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారాడు. 1995లో 'హిట్ల‌ర్' లో అబీబీ అబీబీ సాంగ్ కి కొరియోగ్ర‌ఫీ చేయ‌మ‌న్నాను. ఆ పాట ఇప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేశాడు. అంచ‌లంచెలుగా ఎదిగేస్తూ నంబ‌ర్ 1 స్థానం సాధించాడు." అని చిరు ఏవీలో పేర్కొన్నారు.

'కాంచ‌న 3' సినిమా కూడా లారెన్స్ మ‌రో క‌లికితు రాయి అవుతుంది అని చిరు అన్నారు. "చెన్న‌య్ లో 200 మంది పిల్ల‌ల‌కు ఉచిత విద్య అందిస్తున్నాడు లారెన్స్. 150 మంది పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేయించి జీవితాన్ని ఇచ్చాడు. 60 మంది పిల్ల‌ల వ‌ర‌కూ అడాప్ట్ చేసుకుని వారి బాగోగులు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ట్రస్ట్ ను హైద‌రాబాద్ లోనూ ప్రారంభించే ప్ర‌య‌త్నం చేస్తున్నందుకు గాను నా తరపునుండి సాయంగా రూ.10ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టిస్తున్నాను. లారెన్స్ లాంటి వాళ్లు మ‌రెంద‌రో రావాలి. స్ఫూర్తిగా నిల‌వాలి" అని చిరు అన్నారు. అల్లు అరవింద్ 10 లక్షల చెక్ ని లారెన్స్ కి అందచేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories