నాకు డైలాగులు ఎలా పలకాలో నేర్పించారు.. అయన నాకు గురువు : చిరంజీవి

నాకు డైలాగులు ఎలా పలకాలో నేర్పించారు.. అయన నాకు గురువు : చిరంజీవి
x
chiranjeevi, Gollapudi Maruthi rao ( file photo)
Highlights

తనతో కలసి ఎన్నో చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు మృతి చెందారని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం

తనతో కలసి ఎన్నో చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు మృతి చెందారని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మారుతీరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు చిరు ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. ఈ సంధర్భంగా చిరంజీవి మారుతీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

గొల్లపూడి మారుతీరావుతో తనకున్నది గురుశిష్యల సంబంధమని చిరంజీవి చెప్పుకొచ్చారు. గొల్లపూడి కుమారుడు శ్రీనివాస్ అవార్డు ఫంక్షన్‌కి నేను వెళ్లానని ఆ తర్వాత ఆయనని కలిసే అవకాశం రాలేదని చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే ఇలా జరగడం షాక్ కి గురి చేసిందని అన్నారు. 1979లో 'ఐ లవ్‌ యూ' అనే సినిమా చేసినప్పుడు నాకు గొల్లపూడి మారుతీరావు గారితో పరిచయం ఏర్పడింది. అయన నాకు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. అలా అయన నాకు గురువు అయ్యారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చిరు పేర్కొన్నారు.

1982లో గొల్లపూడి, చిరంజీవి కలిసి 'ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య' సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా బాగా హిట్టు కావడంతో ఆ తర్వాత వరుసగా ఆలయ శిఖరం, అభిలాష, ఛాలెంజ్ సినిమాలలో కలిసి నటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories