Chiranjeevi: "ఆ టైటిల్ కి చిరు నే ఆప్ట్" అంటున్న మెహర్ రమేష్

Chiranjeevi Called as Bhola Shankar in Mehar Rameshs Movie
x
భోళా శంకర్ సినిమాలో చిరంజీవిని భోళా శంకర్ అంటారు అన్నారు మెహెర్ రమేష్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Chiranjeevi: "ఈసారి చిరు, తమన్నా మధ్య డాన్సులు అదిరిపోతాయి" అంటున్న డైరెక్టర్

Chiranjeevi: వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న "భోళా శంకర్" సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త‌మిళంలో సూపర్ హిట్ అయిన "వేదాళం" రిమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త‌మ‌న్నా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. చిరు సోద‌రి పాత్రలో కీర్తి సురేష్‌ అందరి దృష్టిని ఆకర్షించబోతోంది. ఈ సినిమాని ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్ లో అన్న‌పూర్ణ స్టూడియోలో లాంచ్ చేశారు దర్శకనిర్మాతలు.

ఈ సంద‌ర్భంగా మెహ‌ర్ ర‌మేష్ మాట్లాడుతూ "ఇంత గ్యాప్ తీసుకున్న త‌ర‌వాత‌ ఓ మంచి క‌థ‌తో చిరంజీవిగారిని కలవడం, ఆయన ఈ సినిమాకి ఒప్పుకోవడం నా జీవితం లోనే మ‌ధుర‌మైన క్ష‌ణం. ఈసినిమా కోసం నా శ‌క్తినంత ధార‌బోస్తాను. త‌మ‌న్నా డేట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం కానీ నేను క‌థ‌ చెప్పేట‌ప్పుడే సినిమాలో హీరోయిన్ త‌మ‌న్నానే అని అంద‌రికీ చెప్పాను. చాలా నాటీ పాత్ర‌ త‌న‌ది. "సైరా" లో చిరంజీవిగారితో తమన్నా కి డాన్స్ లేదు. కానీ ఈసారి మంచి డాన్సింగ్ నెంబ‌ర్స్ సెట్ చేశాం. అన్న‌య్య‌ని అంద‌రూ భోళా శంక‌రుడు అంటారు. అందుకే ఈ టైటిల్ చిరంజీవి గారికి మాత్రమే యాప్ట్. ఈ టైటిల్ పెట్టిన‌ప్పటినుండి సినిమా వైబ్రేష‌నే మారిపోయింది" అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories