Acharya Movie Update: 'ఆచార్య' రిలీజ్ వాయిదా.?

Aacharya Movie
x

ఆచార్య మూవీ ఫైల్ ఇమేజ్

Highlights

Acharya Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'.

Acharya Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను మే మే 13న విడుదలకానుందని చిత్రబృందం ముందే ప్రకటిచింది. అయితే తాజాగా వస్తోన్నసమాచార మేరకు ఈ సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆచార్య కూడా వాయిదా పడిపోయిందని సమాచారం. ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ సినిమా మే 13న రావడం కష్టమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

ఆచార్య జూన్ 18 న విడుదలకానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల చేయనుంది చిత్రబృదం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ‌లో కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో రామ్ చరణ్- పూజాహెగ్డే ఉన్నారు. చరణ్ పూజతో ఉన్న రొమాంటిక్ ఫోటోను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా ప్రేమ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు. విడుదల వాయిదాపై చిత్రం బృదం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories