Acharya Movie: చిరు, రానాలకు బిగ్ షాక్.. రిలీజ్ ఆపేయాలని ఏటీఎఫ్ ఫిర్యాదు

ఆచార్య, విరాట పర్వం
Acharya Movie: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. రెండు పెద్ద సినిమాలకు అడ్డంకులు వచ్చాయి.
Acharya Movie: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. రెండు పెద్ద సినిమాలకు అడ్డంకులు వచ్చాయి. ఆ రెండు చిత్రాలు నిలిపివేయాలని ఫిర్యాదులు వెళ్లాయి. అందులో ఒకటి మెగాస్టార్ సినిమా 'ఆచార్య', రానా దగ్గుబాటి చిత్రం 'విరాటపర్వం'. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఆచార్య', 'విరాట పర్వం' సహా కొన్నిచిత్రాలపై సెన్సార్‌కు ఫిర్యాదు చేశాయి.
నాలుగు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మారనకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సల్స్ అనుకూలంగా ఉన్న 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాలను నిలిపివేయాలని, వాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవద్దని "యాంటీ టెర్రరిజం ఫోరమ్'' తాజాగా సెన్సార్ బోర్డుకు విన్నవించింది. అలాగే, భవిష్యత్‌లోనూ అలాంటి సినిమాలను ప్రోత్సహించొద్దని సెన్సర్ బోర్డును కోరింది. అయితే సెన్సార్ బోర్డు అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఎన్నో నక్సల్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఉన్నాయి. గతంలో గమ్యం, దళం వంటి సినిమాలు నక్సల్స్ నేపథ్యలో వచ్చినవే అవి పెద్ద విజయాన్నే సాధించాయి.
అయితే ఈ సినిమాల్లో పూర్తి నిడివి ఉన్నపాత్రల్లో హీరోలు కనిపిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సివుంది. రానా, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమాను వేణు ఉడుగుల రూపొందిస్తున్నాడు. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో చిత్రం తెరకెక్కుతుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్నగా కనిపించనున్నాడు. దగ్గుబాటి రానా విరాట పర్వం మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 'ఆచార్య'లో రామ్ చరణ్‌తో పూర్తి స్థాయి పాత్రను చేయిస్తున్నాడు చిరంజీవి. చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ‌్ పుట్టిన రోజున పోస్టర్ కూడా విడుదల చేశారు. చిరంజీవి నటిస్తోన్న ఆచార్య మాత్రం మే 13న విడుదల అవబోతుంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMT