నయనతార ను ట్రోల్ చేస్తున్న వారిని ఏకి పారేసిన చిన్మయి

Chinmayi Gave A Strong Comeback To Those Who Trolled Nayanthara
x

నయనతార ను ట్రోల్ చేస్తున్న వారిని ఏకి పారేసిన చిన్మయి

Highlights

Chinmayi Sripada: "అసలు ఈ మగవాళ్ళందరూ అమ్మ పాలు తాగే పెరిగారా లేదా అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది.

A Proper Comeback: లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా "కనెక్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "గేమ్ ఓవర్" ఫేమ్ డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని నయనతార భర్త విఘ్నేశ్ శివన్ స్వయంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నయనతార కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఈవెంట్ కు కూడా వెళ్లిన నయనతార వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో నయనతార బట్టల గురించి చాలామంది నెగటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక ఎప్పుడూ తన అభిప్రాయాన్ని బయట పెట్టడంలో వెనకాడని సింగర్ చిన్మయి శ్రీపాద నయనతార ట్రోలర్లకు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. "అసలు ఈ మగవాళ్ళందరూ అమ్మ పాలు తాగే పెరిగారా లేదా అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది.

ఇలాంటి వాళ్లకి కూతుర్లు పుడితే ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది. సొంత భర్తల దగ్గర మరియు కొడుకుల దగ్గర కూడా తమ కూతుర్లను దుపట్టా వేసుకొని ఉండమని తల్లులు చెప్పడంలో తప్పులేదు. సొంత కూతురు లేదా చెల్లెల్ని చూసిన వాళ్లకి సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయేమో," అని ట్రోలర్ లకు గట్టు రెస్పాన్స్ ఇచ్చింది చిన్మయి. గతంలో వైరముత్తు కాంట్రవర్సీలో కూడా తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిన చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫెమినిస్ట్ మినిస్టర్ ఆక్టివిటీస్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories